కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
- ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి వెనకవైపు ఢీకొట్టి రోడ్డు మధ్యలో ఆగిన మినీ వ్యాను
- అదే సమయంలో అటునుంచి వేగంగా దూసుకొచ్చి వ్యాన్‌ను ఢీకొట్టిన కంటెయినర్ లారీ
- ఐదుగురు అక్కడికక్కడే మృతి
- ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు కన్నుమూత
- మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మంత్రి కొల్లు రవీంద్ర
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. గాయపడిన వారిని మచిలీపట్టణం సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులను మంత్రి కొల్లు రవీంద్ర, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కాగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరో ఆరుగురు మృతి చెందారు.