ఏపీలో చంద్రబాబు రాగానే పెన్షన్లు పెంచారు.. ఇక్కడ కూడా వెంటనే పెంచాలి: హరీశ్ రావు
- తెలంగాణలో కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనని విమర్శ
- 191 రోజులు అయినప్పటికీ ఆచరణలో కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్య
- వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచాలని డిమాండ్
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ బాండ్ పేపర్ల మీద రాసిచ్చిందని గుర్తు చేశారు. కానీ హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఒడిశాలో ముఖ్యమంత్రి వరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,100కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. వరికి బోనస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు. సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదన్నారు.