ఆరెస్సెస్‌ను మోదీయే సీరియస్‌గా తీసుకోరు: కాంగ్రెస్ నేత వ్యాఖ్య
- ఓ పార్టీకి 240, మరో పార్టీకి 234 సీట్లు వచ్చాయని ఆరెస్సెస్ ఇంద్రేశ్ కుమార్ వ్యాఖ్య
- ఆరెస్సెస్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
- వాళ్లు మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉన్నారని వ్యాఖ్య
ఆరెస్సెస్ వాళ్లు మాట్లాడే మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 'ఆరెస్సెస్‌ను ఎవరు సీరియస్‌గా తీసుకుంటారు. ప్రధాని మోదీయే వారిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇక మేమెందుకు తీసుకోవాలి? అతను (ఇంద్రేశ్ కుమార్) మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడితే అందరూ సీరియస్‌గా తీసుకునేవారు. అప్పుడు మౌనంగా ఉండి... అధికారాన్ని అనుభవించి... ఇప్పుడు మాట్లాడుతున్నార'ని వ్యాఖ్యానించారు.