Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ

Hema released from Bengaluru jail
Advertisement
  • రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు
  • బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నటి హేమ
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
Advertisement
ప్రముఖ సినీ నటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆమె విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను సీసీబీ కోర్టుకు అందించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆమె ఈరోజు విడుదలయ్యారు.

వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు: హేమ

హేమ జైలు నుంచి విడుదలయ్యాక సెక్యూరిటీ పోస్ట్ వద్ద ఉన్న సిబ్బంది ఆమెను కన్నడలో ఏదో ప్రశ్నించారు. దానికి ఆమె బర్త్ డే పార్టీ అంటూ సమాధానం ఇచ్చారు. మీడియాతో మాట్లాడకుండా వెళ్తే వేరేరకంగా ఉంటుందని హేమ పక్కన ఉన్న వ్యక్తి ఆమెకు సూచించారు. అయితే, వీళ్లకు చెప్పాల్సిన అవసరం ఏముందంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Advertisement
Advertisement
Hema
Bengaluru
Drugs Case
Tollywood

More Telugu News