Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమతో నీ పెదనాన్న... నారా రోహిత్ కు సీఎం చంద్రబాబు లేఖ

Chandrababu replies to Nara Rohit letter
Advertisement
  • ఇటీవల చంద్రబాబును ఉద్దేశించి నారా రోహిత్ లేఖ
  • ప్రియమైన నారా రోహిత్ అంటూ నేడు బదులిచ్చిన చంద్రబాబు
  • కుటుంబ సభ్యుల అండతోనే ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కోగలిగానని వెల్లడి
Advertisement
ఇటీవల  సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన సోదరుడి కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ భావోద్వేగభరితంగా ఓ లేఖ రాయడం తెలిసిందే. 

40 ఏళ్లుగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా ధైర్యంగా నిలబడ్డారని నారా రోహిత్ ఆ లేఖలో కొనియాడారు. గత ఐదేళ్లుగా ఎంతో వేదన అనుభవించారని, కానీ పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు. 

నారా రోహిత్ లేఖపై చంద్రబాబు నేడు స్పందించారు. "ప్రియమైన నారా రోహిత్... నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు ఎల్లవేళలా నాకు ఉన్నాయి కాబట్టే... ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగాను. నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి... ప్రేమతో నీ పెదనాన్న" అంటూ చంద్రబాబు బదులిచ్చారు.
Advertisement
Advertisement
Chandrababu
Nara Rohith
Letter
TDP
Andhra Pradesh
Tollywood

More Telugu News