ఆధార్-రేషన్ కార్డ్ లింక్ చేయని వారికి మరో అవకాశం
- ఈ నెల 30తో ముగియనున్న గడువు
- మరో మూడు నెలలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
- సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్రం
ఈ రెండింటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. సమీపంలోని రేషన్ దుకాణం లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా అనుసంధానం చేయవచ్చు.