అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో పూజ సెన్షేషన్.. తొలి భారతీయురాలిగా రికార్డ్
- యూఎఫ్‌సీలో బ్రెజిల్ క్రీడాకారిణి రయానేపై విజయం
- యూఎఫ్‌సీలో భారత్‌కు ఇదే తొలి విజయం
- తన విజయం ఇండియన్ ఫైటర్లు, ఫ్యాన్స్‌కు అంకితమన్న పూజ
తొలి రౌండ్‌లో దూకుడు ప్రదర్శించిన పూజ, రెండో రౌండ్‌లో కొంత వెనుకబడినప్పటికీ మూడో రౌండ్‌లో పుంజుకుని ప్రత్యర్థిని చిత్తుచేసి విజయాన్ని అందుకుంది. పూజ తన విజయాన్ని ఇండియన్ ఫైటర్లు, అభిమానులకు అంకితమిచ్చింది. ఇండియన్ ఫైటర్స్ అంటే ఓటమి చెందేవాళ్లు కాదని నిరూపించాలనుకున్నానని పూజ పేర్కొంది. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, భారత అభిమానులు, ఇండియన్ ఫైటర్స్‌ది అని పూజ వివరించింది.