మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. కీలక ఆటగాడికి ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చిన పాక్
- ఆల్‌రౌండర్ ఇమాద్ వాసిమ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్
- పవర్ హిట్టింగ్తో పాటు బౌలింగ్ చేయగల యువ సంచలనం
- పలువురు ఆటగాళ్లు విఫలమవుతున్న నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో ఇమాద్‌కు చోటు దక్కే ఛాన్స్
కాగా నేడు (ఆదివారం) భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఇమాద్ వాసిమ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇమాద్ పవర్ హిట్టింగ్తో పాటు బౌలింగ్ చేయగలడు. దీంతో అతడి వైపు జట్టు మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇటీవలే అమెరికా చేతిలో పాకిస్థాన్ దారుణ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ఇబ్బంది పడ్డాడు. అమెరికా చేతిలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాక్ కెప్టెన్ బాబర్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మరోవైపు, అమెరికా మ్యాచ్‌లో వికెట్ కీపర్ ఆజం ఖాన్ కూడా విఫలమయ్యాడు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని పక్కనపెట్టి ఇమాద్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.