చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీల్లో ఈడీ సోదాలు
- హైదరాబాద్‌తో పాటు ఒంగోలులో తనిఖీలు
- ఎస్‌బీఐ నుంచి రూ. 167 కోట్ల రుణాలు తీసుకుని మోసం
- సీబీఐ కేసు ఆధారంగా విచారిస్తున్న ఈడీ అధికారులు
- బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బును దారి మళ్లించినట్లు గుర్తింపు
బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ నిధులతో డైరెక్టర్లు ఇతరులతో కలిసి కుట్ర చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులు, డైరెక్టర్ల ఖాతాల్లోకి రుణ మొత్తాలను మళ్లించారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆ నిధులను దుర్వినియోగం చేశారని వెల్లడించారు. చదలవాడ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రికవరీ చేశారు. నేరారోపణకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిధులు మళ్లింపునకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.