కాబోయే సీఎం చంద్రబాబును కలిసిన ఏపీ సీఎస్, డీజీపీ
- ఎన్నికల్లో కూటమి విజయం నేపథ్యంలో శుభాకాంక్షలు
- చంద్రబాబు నివాసానికి అధికారుల క్యూ
- ఢిల్లీకి బయలుదేరనున్న టీడీపీ చీఫ్
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లు సాధించడంతో తదుపరి కార్యాచరణ కోసం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.