ఎన్నికల్లో వైసీపీ ఓటమి.. I-PAC స్పెషల్ ట్వీట్!
- వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేసిన I-PAC
- ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వం అందరికీ స్ఫూర్తి అంటూ వ్యాఖ్య
- తమపై నమ్మకం ఉంచినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వైనం
ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ I-PAC టీమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది. "2024 ఏపీ ఎన్నికలు వైఎస్ఆర్‌సీపీతో మళ్లీ కలిసి పనిచేసేలా చేశాయి. I-PAC మరియు దాని నిపుణులందరు కలిసి ఎన్నికల్లో విజయం కోసం కష్టపడ్డాం. ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వం అందరికీ స్ఫూర్తి. మాపై ఆయన నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని తన ట్వీట్‌లో పేర్కొంది.