ప్రభుత్వ ఏర్పాటు కోసం చంద్రబాబునాయుడుతో మాట్లాడలేదు: శరద్ పవార్
- కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం చంద్రబాబు, నితీశ్లతో పవార్ మాట్లాడినట్లుగా ప్రచారం
- వారితో తాను మాట్లాడలేదని స్పష్టం చేసిన శరద్ పవార్
- కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్న పవార్
పవార్ ఇంకా మాట్లాడుతూ, కేంద్రంలో విపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. బుధవారం ఢిల్లీలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరితో మాత్రమే తాను మాట్లాడానన్నారు. తదుపరి ప్రధానమంత్రి ఎవరు? అని మీడియా ప్రశ్నించగా, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవడం లేదన్నారు.
ఉత్తర ప్రదేశ్లో వచ్చిన ఫలితాలు కూటమికి కొత్త మార్గనిర్దేశనం చేశాయన్నారు. మహారాష్ట్రలో బీజేపీ పలు స్థానాల్లో విజయం సాధించినప్పటికీ గతంతో పోలిస్తే సీట్లు తగ్గాయన్నారు. మహారాష్ట్రలో తమ పార్టీ పది చోట్ల పోటీ చేయగా ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నామన్నారు.