కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం జగన్... రాజీనామా సమర్పణ!
- ఏపీలో విజయం దిశగా టీడీపీ కూటమి
- వైసీపీకి ఊహించని రీతిలో ఎదురుదెబ్బ
- రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా మారుతున్న పరిణామాలు
కూటమి విజయం లాంఛనం కాగా, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అందుకు వీలు కల్పిస్తూ సీఎం జగన్ పదవి నుంచి వైదొలగనున్నారు.
ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు జరిగిన ప్రకారం... టీడీపీ ఒక స్థానంలో గెలిచి మరో 132 స్థానాల్లో ముందంజలో ఉండగా, జనసేన 20, వైసీపీ 16, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.