సీబీఐ కేసులోనూ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 7వ తేదీ వరకు పొడిగించింది. అంతకుముందు, ఈడీ కేసులో కవిత కస్టడీని వచ్చే నెల 3 వరకు పొడిగించిన న్యాయస్థానం... ఆ తర్వాత సీబీఐ కేసులోనూ ఈ శుక్రవారం వరకు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ జూన్ 7న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

CBI
K Kavitha
Delhi Liquor Scam
Telangana

More Telugu News