యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్

Chandrababu Naidu phones Yanamala Ramakrishnudu
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నాడు ఫోన్ ద్వారా పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన యనమల ఆరోగ్య పరిస్థితిని ఆయన ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుతున్న చికిత్స వివరాలను, ఆయన క్షేమ సమాచారాలను చంద్రబాబు ఆరా తీశారు.

ఈ సందర్భంగా, పార్టీకి సీనియర్ నేతగా యనమల సేవలు ఎంతో కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, మళ్లీ ప్రజా క్షేత్రంలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. 

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైద్యులు ఆయన గుండెకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. యనమల త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆకాంక్షిస్తున్నారు.
Go Back to Shorts
Yanamala Ramakrishnudu
Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Yanamala Health
Political News
AP News

More Telugu News