తెలంగాణ ప్రజలకు మోదీ, రాహుల్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

  • గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ సొంతమన్న మోదీ
  • రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వెల్లడి
  • ప్రజా తెలంగాణ దార్శనికతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, పదేళ్ల తెలంగాణ వేడుకల వేళ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సోదరసోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. దేశాభివృద్ధిలో తెలంగాణ అందించిన సహకారం ప్రతీ భారతీయుడికీ గర్వకారణమని చెప్పారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ ప్రత్యేకత అని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.

తెలంగాణ అమరులకు నివాళులు: రాహుల్
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. సమానత్వం, సమ న్యాయం, సాధికారత.. ప్రజా తెలంగాణ దార్శనికతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వివరించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Modi Wishes
Rahul Gandhi Tweet
Telangana Formation Day

More Telugu News