చంద్రబాబు, పవన్ కు భారీ మెజారిటీ... లోకేశ్ గెలుపు: 'ఆరా' అంచనాలు ఇవీ!

01-06-2024 Sat 19:59 | Andhra
Advertisement
  • ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా సంస్థ
  • ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆరా అధినేత షేక్ మస్తాన్
  • పవన్ కల్యాణ్, లోకేశ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి
  • బాలకృష్ణ హ్యాట్రిక్ ఖాయమని అంచనా
Advertisement
ఆరా (AARAA) సంస్థ అధినేత షేక్ మస్తాన్ ఏపీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఆరా సంస్థ తరఫున ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మస్తాన్... ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించారు. 

గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని అంచనా వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని, అదే విధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వనున్నారని 'ఆరా' మస్తాన్ వివరించారు. 

ఇక, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతాడని అంచనా వేశారు. బాలయ్యకు మంచి మెజారిటీ వస్తుందని అన్నారు. 

అయితే... ఓవరాల్ అంచనాల ప్రకారం ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాలు గెలుచుకోవచ్చని, టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు లభిస్తాయని మస్తాన్ వివరించారు. 

అదే సమయంలో లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి 13 నుంచి 15 స్థానాలు, టీడీపీ కూటమికి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా వేశారు.
Advertisement
AARAAExit PollsPawan KalyanChandrababuNara LokeshAP Assembly PollsLok Sabha PollsAndhra Pradesh

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more