పోస్టల్ బ్యాలెట్ల అంశంలో తీర్పు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

31-05-2024 Fri 19:19 | Andhra
Advertisement
  • పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై వివాదం
  • గెజిటెడ్ అధికారం సంతకం ఉంటే, స్టాంపు లేకపోయినా ఫర్వాలేదన్న సీఈవో
  • ఇది ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధం అంటూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ
Advertisement
పోస్టల్ బ్యాలెట్లపై అటెస్టేషన్ అధికారి సీల్ తో పాటు సంతకం ఉండాలని గతంలో ఈసీ చెప్పిందని, కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా సీఈవో మెమో ఇచ్చారంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ వాదనలు వినడం పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్లపై తీర్పు వెలువరించనున్నట్టు హైకోర్టు పేర్కొంది. 

ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ సీఈవో  ఈ నెల 25, 27 తేదీల్లో రెండు మెమోలు ఇచ్చారని, వాటిని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించింది.

అప్పిరెడ్డి తరఫున అడ్వొకేట్ సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు.

ఫారం 13-ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, హోదా వివరాలు చేతితో రాసినా ఆమోదించాలని ఈసీ పేర్కొందని... కానీ అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే చాలని, స్టాంపు లేకపోయినా, హోదా వివరాలు చేతితో రాయకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లు ఆమోదించాలని ఏపీ సీఈవో మెమోలు జారీ చేశారని ఆరోపించారు. 

ఈసీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏపీ సీఈవో ఇచ్చిన ఈ సడలింపులను రద్దు చేయాలని, ఈసీ గత ఏడాది జులైలో ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అటు, ఎన్నికల సంఘం తరఫున సీనియర్ అడ్వొకేట్ అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు.
Advertisement
Postal BallotsYSRCPAP High CourtCEOAndhra Pradesh

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more