భారత క్రికెటర్ సంచలన పోస్ట్.. నెట్టింట వైరల్!
- 'కళ్లన్నీ రఫా వైపే' అంటూ సెలబ్రిటీల పోస్టులు
- పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం దీనికి మద్దతుగా పోస్టులు పెట్టిన వైనం
- ఈ క్రమంలో భారత క్రికెటర్ రాహుల్ తేవాటియా సరికొత్త పోస్ట్
- 'అందరి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువులపై' ఉందంటూ ఇన్‌స్టా స్టోరీ
ఈ సందర్భంగా అతడు పాకిస్థాన్‌లోని హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తాడు. 'అందరి దృష్టి పాకిస్థాన్‌లోని హిందువులపై ఉంది' అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెవాటియా పెట్టాడు. ‘All Eyes on Hindus in Pakistan’ అంటూ పెట్టిన అతని ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఎంతో మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాలు సమన్వయంతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రావాలని, ఈ మారణహోమాన్ని ఆపాలని కోరుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో కొన్ని దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతు పలుకుతోంటే.. మరికొన్ని పాలస్తీనాకు అండగా నిలుస్తున్నాయి.