ఎన్టీఆర్... తెలుగుజాతి చిహ్నం అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్
- ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురి నివాళి
- పార్టీలకతీతంగా బీజేపీ, కాంగ్రెస్ నేతల నివాళి
- ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ల ట్వీట్
'ఎన్టీఆర్… తెలుగుజాతి చిహ్నం. ఆ మహనీయుడి 101 జయంతి సందర్భంగా ఘన నివాళి.' అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
'ప్రముఖ చలనచిత్ర నటులు, నటరత్న, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రివర్యులు డా.నందమూరి తారకరామారావు గారి జయంతిని పురస్కరించుకుని వారికి ఘననివాళులు అర్పిస్తున్నాను.' అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
'తన నటనతో దేశ సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన ధీశాలి.. ఏ పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.. తెలుగుతనానికి తేనియలద్దిన తేజోవిరాళి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నమస్సుమాంజలి.' అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.