ఢిల్లీలో రేవంత్ రెడ్డి.. సోనియాను కలవనున్న తెలంగాణ సీఎం
- రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
- రాహుల్, ప్రియాంక, ఖర్గేలకూ పిలుపు
- సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్న తెలంగాణ సీఎం
అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి పంజాబ్ వెళతారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. మంగళవారం సాయంత్రానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆరోగ్య కారణాలతో పాటు జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోనియా గాంధీ హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.