భారత ఎన్నికలపై ట్వీట్ చేసిన పాకిస్థాన్ ఎంపీకి కేజ్రీవాల్ దిమ్మతిరిగే కౌంటర్!
- ఢిల్లీలో కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకొని ట్వీట్ చేసిన కేజ్రీవాల్
- కేజ్రీవాల్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని పేర్కొన్న పాక్ ఎంపీ
- ముందు మీ దేశం గురించి ఆలోచించుకోవాలని కేజ్రీవాల్ చురక
- భారత్‌లో ఎన్నికలు మా అంతర్గత విషయం... ఉగ్రవాద దేశ జోక్యం అవసరం లేదంటూ మండిపాటు
ఈ ట్వీట్‌ను ఫవాద్ చౌదరి రీట్వీట్ చేస్తూ... ద్వేషం, అతివాదభావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్ చేశారు. మోర్ పవర్, ఇండియా ఎలక్షన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. పాక్ ఎంపీ ట్వీట్‌పై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.
'చౌదరీ సాబ్, నేను, మా దేశ ప్రజలం మా సమస్యలను పరిష్కరించుకోగలం. మీ జోక్యం ఇందులో అవసరం లేదు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. మీరు మీ దేశం గురించి ఆలోచించుకోండి. భారతదేశంలో ఎన్నికలు మా అంతర్గత విషయం. ఇందులో ఉగ్రవాదానికి నిలయమైన మీ దేశ జోక్యాన్ని భారత్ సహించదు' అని కౌంటర్ ఇచ్చారు.
కేజ్రీవాల్ కౌంటర్‌పై ఫవాద్ చౌదరి
ముఖ్యమంత్రి గారూ, (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) నిజానికి ఎన్నికలు మీ సొంత విషయమే కానీ తీవ్రవాదం పాకిస్థాన్‌లో ఉన్నా... ఎక్కడ ఉన్నా అందరికీ ప్రమాదకరమే అన్నారు. ఆదర్శవంతమైన వ్యక్తులు మెరుగైన సమాజం కోసం ప్రయత్నించాలన్నారు. పాకిస్థాన్ అంశం లేకుండా భారత రాజకీయ నాయకుల ప్రసంగం పూర్తి కాదని పేర్కొన్నారు. కానీ అదే పాకిస్థాన్‌లో భారత రాజకీయాల గురించి ఎవరూ పట్టించుకోరన్నారు. బీజేపీ యాంటీ ముస్లిం సెంటిమెంట్ కోసం పాకిస్థాన్ పేరును ఉపయోగిస్తుందన్నారు.