ఫ్లిప్‌కార్ట్‌లో వాటాను కొనుగోలు చేయనున్న గూగుల్!
- మైనర్ వాటా కొనుగోలుకు పెట్టుబడులు
- ప్రతిపాదన చేసిన సెర్చింజన్ దిగ్గజం గూగుల్
- గూగుల్ పెట్టుబడి వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందన్న ఫ్లిప్‌కార్ట్
కాగా తాజా నిధుల సమీకరణలో భాగంగా గూగుల్‌ను మైనర్ వాటాదారుగా చేర్చుకోబోతున్నట్టుగా ఫ్లిప్‌కార్ట్ వివరణ ఇచ్చింది. గూగుల్ ప్రతిపాదనకు నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడితో పాటు ‘క్లౌడ్’ సహకారం కూడా అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని, ఫ్లిప్‌కార్ట్ వ్యాపార విస్తరణకు ఈ ఒప్పందం ఉపయోగపడనుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరిన్ని సేవలు అందించేందుకు తమ డిజిటల్ సదుపాయలను ఆధునికీకరించుకునేందుకు అవకాశం దక్కనుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
కాగా తాజా రౌండ్‌లో ఫ్లిప్‌కార్ట్ సుమారు 350 మిలియన్ డాలర్ల మేర సమీకరించవచ్చుననే వార్తలు వెలువడుతున్నాయి. అయితే గూగుల్ ప్రతిపాదిత పెట్టుబడిపై ఎలాంటి సమాచారం తెలియరాలేదు.