Cyclone Remal: బంగాళాఖాతంలో 'రెమాల్' తుపాను... వాళ్లకు వర్షాలు, మనకు ఎండలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా మారితే దీనిని 'రెమాల్' అని పిలవనున్నారు. 

కాగా, ఈ నెల 25వ తేదీ రాత్రికి తీవ్ర తుపానుగా బలపడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తర ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 28 వరకు బెంగాల్ లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. 

అదే సమయంలో, ఏపీపై ఈ తుపాను ప్రభావం ఏమాత్రం ఉండదని, రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఏపీలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
Cyclone Remal
Bay Of Bengal
Andhra Pradesh
Heat Wave
Heavy Rains
West Bengal
Odisha
IMD

More Telugu News