Nakka Anand Babu: చంద్రబాబు విదేశీ పర్యటనపై దుష్ప్రచారం చేస్తున్నారు: నక్కా ఆనంద్ బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. జగన్ మాదిరిగా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలేవీ లేవని అన్నారు. ఆయన ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళతారని స్పష్టం చేశారు. 

జగన్ విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని నక్కా ఆనంద్ బాబు వెల్లడించారు. జగన్ పై 13 సీబీఐ చార్జిషీట్లు ఉన్నాయని తెలిపారు. 

జగన్ పిల్లలు ఇంటికి వచ్చినా కానీ, వాళ్లను తీసుకుని మళ్లీ లండన్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. అబద్ధాలతో నమ్మించాలనుకుంటే అది పిచ్చి భ్రమ అవుతుందని అన్నారు. టీడీపీ నూటికి 1000 శాతం అధికారంలోకి రావడం ఖాయమని నక్కా ఆనంద్ బాబు ధీమా వ్యక్తం చేశారు.
Nakka Anand Babu
Chandrababu
Foreign Tour
Jagan
TDP
YSRCP

More Telugu News