చెడ్డీ గ్యాంగ్ తరహాలో చుడీదార్ గ్యాంగ్... ఎక్కడో కాదు హైదరాబాదులోనే!

Chudidar gang robbers a house in Hyderabad
  • గతంలో హైదరాబాదులో చెడ్డీ గ్యాంగ్ విజృంభణ
  • నిక్కర్లు, బనియన్లు ధరించి దోపిడీలు
  • అదే కోవలో ఇప్పుడు చుడీదార్లు ధరించి దొంగతనాలు
  • ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ కాలనీలో ఘటన
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైట్ నిక్కర్లు, బనియన్లు మాత్రమే ధరించి చోరీలకు పాల్పడడం ఈ ముఠా ప్రత్యేకత. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే చుడీదార్ గ్యాంగులు బయల్దేరినట్టు అర్థమవుతోంది. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. 

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్ కాలనీలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆకృతి ఆర్కేడ్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. చుడీదార్ ధరించిన దొంగలు ఆయన ఇంట్లోకి చొరబడి రూ.1 లక్ష నగదు, ఒక ల్యాప్ ట్యాప్, నాలుగు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్ మెంట్ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Go Back to Shorts
Chudidar Gang
Hyderabad
Theft
Cheddy Gang

More Telugu News