ఉత్తరప్రదేశ్ వ్యక్తి అకౌంట్లో అకస్మాత్తుగా రూ.9,900 కోట్లు!
- బదోహీ జిల్లాలో ఘటన
- కస్టమర్‌కు చెందిన కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ ఎన్‌పీఏగా మారిన వైనం
- అకౌంట్‌పై ఎన్‌ఫీఏ సంబంధిత ఆంక్షలు విధింపు
- ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అకౌంట్‌లో భారీ మొత్తం కనిపించిన వైనం
- దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని, అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టామన్న మేనేజర్
‘‘సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అకౌంట్‌లో అంత మొత్తం కనిపించిందని భాను ప్రకాశ్‌కు మేము వివరించాము. పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నాము. అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందుజాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్‌లో పెట్టాము’’ అని బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు.
‘‘ఎన్‌పీఏలకు సంబంధించిన అకౌంట్లపై కొన్ని పరిమితలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాము. భాన్ ప్రకాశ్ తన అకౌంట్ చెక్ చేసినప్పుడు అది ఎన్‌పీఏ ఆంక్షల కారణంగా నెగెటివ్‌లో కనిపించింది. పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము’’ అని ఆయన తెలిపారు.