రణరంగంలా తైవాన్ పార్లమెంట్.. చితక్కొట్టేసుకున్న ఎంపీలు.. వీడియో ఇదిగో!
- ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించే చట్ట సభ్యులకు మరిన్ని అధికారాలపై చర్చ
- ముష్టిఘాతాలు, పిడిగుద్దులు, తోపులాటలతో యుద్ధరంగాన్ని తలపించిన పార్లమెంట్
- అధ్యక్షుడు చింగ్ తే బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఘటన
ఎంపీలు స్పీకర్ చుట్టూ చేరడం, కొందరు టేబుళ్ల పైకెక్కి దూకడం, మరికొందరు సహచరులను నేలపై ఈడ్చుకెళ్తుండడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ ఘటన ఆ తర్వాత సద్దుమణిగింది. శాసనసభ మెజారిటీ లేకున్నా సరే సోమవారం అధ్యక్షుడిగా ఎన్నికైన చింగ్ తే బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.