హైదరాబాద్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..!
Advertisement

హైదరాబాద్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..!

Drugs Caught in Hyderabad
  • ఎస్‌వోటీ పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ‌ గంజాయి, ఎండీఎంఏ
  • కూకట్‌పల్లి ప‌రిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏక‌కాలంలో అధికారుల సోదాలు
  • పోలీసుల అదుపులో న‌లుగురు నిందితులు
హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించినట్టు సమాచారం. ఈ సోదాల్లో అధికారులు 3 గ్రాముల ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ రాజశేఖర్, శైలేష్‌ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అలాగే తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రోహిత్‌, తిలక్‌ సింగ్‌ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ ప‌ట్టుబ‌డింది. దాంతో ఆ ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.
Advertisement
Drugs
Hyderabad
Telangana

More Telugu News