ఓటు వేసేందుకు వస్తున్న వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు... బుకింగ్ కోసం ప్రత్యేక నెంబరు
- ఏపీలో రేపు ఎన్నికలు
- పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి తరలి వస్తున్న ఓటర్లు
- ప్రయాణికుల కోసం చర్యలు తీసుకున్న ఏపీఎస్ఆర్టీసీ
స్వస్థలాలకు చేరుకునే ఓటర్ల కోసం స్పెషల్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బస్సులను ప్రయాణికులు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని ఎపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
40 మంది, అంతకుమించి ప్రయాణికులు కలిసి బస్సును బుక్ చేసుకోవచ్చని వివరించింది. అందుకోసం ప్రత్యేకంగా 99591 11281 ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆర్టీసీ పేర్కొంది.