కల్యాణ్ రామ్ మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం.. భారీ నష్టం!
- కల్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి కాంబోలో వస్తున్న మూవీ
- ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ ఎంటర్టయినర్‌గా తెరకెక్కుతున్న సినిమా కోసం భారీ సెట్
- మూవీ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం కారణంగా రూ. 4కోట్ల మేర నష్టం
అయితే, తొమ్మిది రోజుల షూటింగ్ పూర్తి కాగా, మరో రోజు షూటింగ్ మిగిలి ఉండగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సెట్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిన తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించేలోపే సెట్ మొత్తం కాలి బూడిదైపోయిందట. కాగా, ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి కూడా కీరోల్ చేస్తున్నారని సమాచారం.