Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తప్ప తాగి బార్ బయట పోలీసులపై యువతుల దాడి!

3 Drunk Women Attack Abuse Cops Outside Maharashtra Bar Arrested
Advertisement
  • ముంబై శివార్లలోని విరార్ లో ఘటన.. నెట్టింట వీడియో వైరల్
  • అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • న్యాయస్థానం ఆదేశంతో జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు
Advertisement
ముంబై శివార్లలోని ఓ బార్ లో ముగ్గురు యువతులు లేట్ నైట్ పార్టీ చేసుకున్నాక వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో పోలీసులపైనే దాడి చేశారు. నిషా ఊపులో యువతులు హల్ చల్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. చివరకు పోలీసులు అరెస్టు చేయడంతో దెబ్బకు వారి మత్తు దిగింది.

ముంబైలోని విరార్ ప్రాంతంలో ఉన్న గోకుల్ టౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బార్ అండ్ రెస్టారెంట్ బయట ముగ్గురు యువతులు హంగామా చేస్తున్నారంటూ కొందరు స్థానికులు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు.

కానీ నిషా తలకెక్కడంతో ఆ యువతులు పోలీసులతో తొలుత వాగ్వాదానికి దిగారు. ఇష్టం వచ్చినట్లుగా వారిని దుర్భాషలాడారు. ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ చెయ్యి కొరకడమే కాకుండా ఆమె యూనిఫాంను చించేశారు. మరో కానిస్టేబుల్ తలపై బకెట్ తో బాదారు. అలాగే అతని చేతినీ కొరికారు. నిందితులను కావ్య, అశ్వని, పూనంగా గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

https://www.ndtv.com/video/embed-player/?id=783106


Advertisement
Advertisement
drunk women
attack
police
mumbai
virar
arrested

More Telugu News