పద్మ విభూషణ్ గ్రహీతలకు కేంద్ర హోం శాఖ విందు... కుటుంబసభ్యులతో హాజరైన మెగాస్టార్ చిరంజీవి
- ఈ ఏడాది వెంకయ్యనాయుడుతో పాటు పద్మ విభూషణ్ కు ఎంపికైన చిరంజీవి
- నేడు అవార్డు స్వీకరించిన మెగాస్టార్
- పద్మ విభూషణ్ విజేతల గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన అమిత్ షా
కేంద్రం ఈ ఏడాది మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇటీవల అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగినా, ఆ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఇవాళ చిరంజీవికి అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించింది.