చీఫ్ సెక్రటరీ జగన్ కోసమే పని చేస్తున్నారు: కనకమేడల
- డీజీపీని మార్చగానే జగన్ భయపడుతున్నారన్న కనకమేడల
- ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని జగన్ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శ
- జగన్ అవినీతి గురించి మోదీ, అమిత్ కూడా మాట్లాడారని వ్యాఖ్య
జగన్ అవినీతి గురించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడారని అన్నారు. జగన్ స్కాంల గురించి బీజేపీ నేతలు వివరిస్తున్నారని చెప్పారు. ఈసీపై ఒత్తిడి తెచ్చి అధికారులను మారుస్తున్నారని అంటున్నారని.... 2019 ఎన్నికల్లో మీరు ఈసీపై ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వడానికి కూడా జగన్ వద్ద డబ్బులు లేవని అన్నారు. పెన్షనర్ల మరణాలకు జగనే బాధ్యత వహించాలని చెప్పారు.