SR Nagar Hostel: నీళ్లు వాడుకున్నాడని యువకుడిపై దాడి చేసిన హాస్టల్ నిర్వాహకుడు.. వీడియో ఇదిగో!

హాస్టల్ లో ఉంటున్న స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన ఓ యువకుడు అక్కడ కొన్ని నీళ్లు వాడుకున్నాడు. ఇది చూసి రెచ్చిపోయిన హాస్టల్ నిర్వాహకుడు ఆ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ గొడవతో అక్కడికి చేరిన చుట్టుపక్కల వాళ్లు ఆపుతున్నా వినకుండా కాలితో తన్నుతూ, చేతులతో కొడుతూ దారుణంగా ప్రవర్తించాడు. ఈ దాడిలో యువకుడి షర్ట్ చినిగిపోయి, శరీరంపై గాయాలయ్యాయి. అడ్డుకున్న అతడి స్నేహితుడికీ గాయాలయ్యాయి. అసభ్యకరమైన భాషలో తిడుతూ వారిపై దాడి చేశారు.

ఈ ఘటన మొత్తం సదరు హాస్టల్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న మరో హాస్టల్ లోని యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, అసలు గొడవ ఎందుకు మొదలైంది, హాస్టల్ నిర్వాహకుడు అంత దారుణంగా ఎందుకు దాడి చేశాడనే వివరాలు తెలియరాలేదు. బాధిత యువకులు పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ నిర్వాహకుడిపై వారు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాఫ్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
SR Nagar Hostel
Hostel Owner Attack
Hyderabad
Private Hostel
Viral Videos

More Telugu News