ముంబయితో మ్యాచ్... టాస్ ఓడిన సన్ రైజర్స్
- ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
- మళ్లీ సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్
ఈ మ్యాచ్ ద్వారా మయాంక్ అగర్వాల్ మళ్లీ సన్ రైజర్స్ జట్టులోకి వచ్చాడు. ముంబయి జట్టులో అన్షుల్ కాంభోజ్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. కాగా, సన్ రైజర్స్ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించింది. టోర్నీలో ఆ జట్టు ఇంకా 4 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, వాటిలో రెండు గెలిస్తే ప్లేఆఫ్ దశలో ప్రవేశించే వీలుంటుంది.