నన్ను చూస్తే రేవంత్ రెడ్డికి అంత కడుపుమంట ఎందుకు?: డీకే అరుణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను చూస్తే రేవంత్ రెడ్డికి అంత కడుపుమంట ఎందుకు?: డీకే అరుణ

DK Aruna fires at CM Revanth Reddy
  • ముఖ్యమంత్రి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం
  • మహబూబ్ నగర్ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తనను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శ
  • రేవంత్ రెడ్డి తన రక్తం గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం
తనను చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత కడుపుమంట ఎందుకని మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రి తనను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో సోమవారం ఆమె తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మహబూబ్ నగర్ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తనను అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు.

రేవంత్ రెడ్డి తన రక్తం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం కొత్త కొత్త మాటలతో కాంగ్రెస్ వాళ్లు ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. తనకు వస్తున్న ఆదరణను చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. రైతుల సాగు నీటి కష్టాలు తీర్చడం కోసం గద్వాల నుంచి హైదరాబాద్ వరకు 11 రోజుల పాటు పాదయాత్ర చేశానన్నారు. పాలమూరు అభివృద్ధి కోసం పని చేసిన తనపై రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు.
Advertisement
DK Aruna
BJP
Revanth Reddy
Congress

More Telugu News