ఒకటే వీధి.. తండ్రిది ఆంధ్రా.. కొడుకుది తెలంగాణ!
- భద్రాచలంలోని రాజుపేటలో విచిత్ర
- రోడ్డుకు అటువైపున తండ్రి ఇల్లు, ఇటువైపున కుమారుడి ఇల్లు
- తండ్రి అరకు లోక్‌సభ స్థానం పరిధిలోకి.. కుమారుడు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయింది. రాజుపేటలోని ఓ వీధి ఓవైపు తెలంగాణలోని మహహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తే, మరోవైపున్న ప్రాంతం ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు లోక్‌సభ పరిధిలోకి వెళ్లాయి.
ఈ క్రమంలో శ్రీనివాస్ ఇల్లు అరకు లోక్‌సభ స్థానం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి చేరింది. అదే వీధిలో తండ్రి ఇంటికి ఎదురుగా రోడ్డుకు అవతలి వైపున ఇల్లు కట్టుకున్న శ్రీనివాస్ కుమారుడు జానకీరామ్ తెలంగాణలోని మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వెళ్లిపోయాడు.