G. Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Kishan Reddy open letter to Revanth Reddy
  • ఎవరి హయాంలో ఎన్ని నిధులు వచ్చాయో తెలుసుకోవడానికి చర్చకు ఆహ్వానిస్తూ లేఖ
  • 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు వచ్చాయి?
  • 2014 నుంచి 2024 వరకు ఎన్డీయే హయాంలో ఎన్ని నిధులు వచ్చాయి?
  • చర్చిద్దాం రావాలంటూ ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని.. ఈ పదేళ్ల కాలంలో గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి తన ప్రచార సభలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు.

పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారు? పదేళ్ల ఎన్డీయే హయాంలో ఎంత ఇచ్చారు? తేల్చుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? 2014 నుంచి 2024 వరకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎన్ని?  చర్చకు ఆహ్వానిస్తూ ఆయన లేఖ రాశారు.

More Telugu News

G. Kishan Reddy
Revanth Reddy
BJP
Telangana