పూజారి ఆశీర్వాదం తీసుకున్న మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్

04-05-2024 Sat 15:12 | Telangana
Advertisement
  • మూసారాంబాగ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అసదుద్దీన్
  • పర్యటనలో భాగంగా ఆంజనేయస్వామి ఆలయం పక్క నుంచి వెళ్లిన అసదుద్దీన్
  • ఎంపీకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరిన మజ్లిస్ కార్యకర్తలు
Advertisement
హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారంలో భాగంగా పూజారుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈరోజు ఆయన మూసారాంబాగ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా హనుమాన్ గుడి పక్క నుంచి వెళుతున్నారు. 

ఆ సమయంలో అక్కడే ఉన్న మజ్లిస్ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ అధినేతను ఆశీర్వదించాలని హనుమంతుడి గుడి పూజారులను కోరారు. అసదుద్దీన్ కూడా పూజారి ఆశీర్వాదం కోసం ముందుకు వచ్చారు. పూజారి అసదుద్దీన్ మెడలో పూలమాల వేసి, శాలువా కప్పి సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం అర్చకులతో కలిసి అసదుద్దీన్ ఫొటో దిగారు. ఇటీవల అసదుద్దీన్ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు పురోహితులు పాల్గొన్నారు.
Advertisement
Asaduddin OwaisiMIMLok Sabha PollsBJP

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more