1075 మ్యాచ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. మునుపెన్నడూ చూడని రికార్డు నమోదు
- ఒకే మ్యాచ్లో 50 ప్లస్ స్కోర్లు చేసిన ముగ్గురు 23 ఏళ్ల లోపు యువ ఆటగాళ్లు
- సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో అర్ధ సెంచరీలతో చెలరేగిన నితీశ్ రెడ్డి, జైస్వాల్, రియాన్ పరాగ్
- ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా అరుదైన రికార్డు
ఈ మ్యాచ్లో భారత్కు చెందిన ముగ్గురు 23 ఏళ్లలోపు ఆటగాళ్లు అర్ధ సెంచరీలకు పైగా స్కోర్లు చేశారు. సన్రైజర్స్ తరపున నితీష్ రెడ్డి, రాజస్థాన్ రాయల్స్ తరపున యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ 50 ప్లస్ స్కోర్లు చేశారు. ఈ విధంగా ఇంతకుముందెప్పుడూ ఒకే మ్యాచ్లో ముగ్గురు 23 ఏళ్ల లోపు ఆటగాళ్లు యాభైకి పైగా స్కోర్లు చేయలేదని ఐపీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. ఐపీఎల్లో ఇప్పటివరకు 1075 మ్యాచ్లు జరగగా తొలిసారి ఈ రికార్డు నమోదయింది.
కాగా ఈ మ్యాచ్లో నితీశ్ రెడ్డి 42 బంతుల్లో 76 పరుగులు బాదాడు. అందులో ఏకంగా 8 సిక్సర్లు ఉన్నాయి. ఇక రాజస్థాన్ స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 67 పరుగులు కొట్టాడు. ఇక రియాన్ పరాగ్ 49 బంతుల్లో 77 పరుగులు బాదాడు.