కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం: సుప్రీంకోర్టు
- మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు... ఇవ్వకపోవచ్చు కానీ పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీంకోర్టు
- బెయిల్ పిటిషన్‌పై మే 7న వాదనలు వింటామన్న న్యాయస్థానం
- విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం
ఢిల్లీ ముఖ్యమంత్రికి మధ్యంతర బెయిల్‌కు అవకాశముందని... అయితే తదుపరి తేదీనే (మే 7న) విచారణ ముగుస్తుందని చెప్పలేమని పేర్కొంది. విచారణ ఈరోజు పూర్తి చేయలేం... మంగళవారం ఉదయానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది. విచారణకు సమయం పడుతుందనుకుంటే... వాదనలను బట్టి మధ్యంతర బెయిల్ గురించి ఆలోచించవచ్చునని తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో మీ వాదనలు వింటామని కేజ్రీవాల్‌కు తెలిపింది. మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు... ఇవ్వకపోవచ్చు.. కానీ పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.