ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్... కాంగ్రెస్‌లో చేరిన మేయర్

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్... కాంగ్రెస్‌లో చేరిన మేయర్

Khammam Mayor joins congress from brs
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మేయర్ నీరజ
  • మేయర్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన మరో ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు
  • మొదటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులుగా ఉన్న నీరజ దంపతులు
బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో భారీ షాక్ తగిలింది. ఖమ్మం నగర మేయర్ నీరజ అధికార పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. తుమ్మల ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్‌తో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మేయర్ నీరజ, ఆమె భర్త బ్రహ్మంలు మొదటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు. దీంతో వారు కాంగ్రెస్‌లో చేరతారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లలో 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపుడి రమాదేవి, 13వ డివిజన్ కార్పొరేటర్ నీరజ ఉన్నారు.
Advertisement
Khammam District
BRS
Congress

More Telugu News