రష్యా దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం
- ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగరంలో ఉన్న హ్యారీపోటర్ కోట
- ఇసికందర్ క్షిపణితో రష్యా దాడి
- దాడిలో ఐదుగురి దుర్మరణం
క్షిపణి ఢీకొన్న చోట నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు శకలాలు పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి కారణంగా చుట్టుపక్కల ఉన్న మరో 20 భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దాడికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ విడుదల చేశారు. ఇందులో ఓ సుందర భవనం అగ్నికీలలకు ఆహుతి అవుతున్న చిత్రం కూడా ఉంది. మరోవైపు ఖార్కీవ్ నగరంలోని ఓ రైల్వే లైన్ పై రష్యా గైడెడ్ బాంబ్ తో దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఉక్రెయిన్ లో రెండో పెద్ద నగరం ఖార్కీవ్.