కార్యకర్తల కోసం నా ప్రాణాలైనా ఇస్తా... నా కొడుకు లేడు, మీరే వారసులు: మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం
- గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించిన కార్యకర్తలకు చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని వ్యాఖ్య
- లోక్ సభ ఎన్నికల్లో రఘువీర్‌కు భారీ మెజార్టీ ఇవ్వాలన్న కోమటిరెడ్డి
- రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా
కాబోయే ఎంపీ రఘువీర్‌తో కలిసి సర్పంచ్ ఎన్నికల్లో మీకోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. పేద పిల్లల చదువు బాధ్యతను ప్రతీక్ ఫౌండేషన్ తీసుకుంటుందన్నారు. నీళ్ల కరవుకు కారణం బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. కేసీఆర్ ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రెండు వందల ఎకరాల్లో పదివేల ఇళ్లు కడతామన్నారు. కేసీఆర్, కేటీఆర్ మానసిక పరిస్థితి దిగజారిందని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తే మూసీనదిలో వేసినట్లే అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పంద్రాగస్ట్ లోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్దమేనని సవాల్ చేశారు. అగ్గిపెట్టె రావు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని చురక అంటించారు.