షాపింగ్ మాల్‌లో ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్ల సందడి.. ఇదిగో వీడియో!
- గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో సన్ రైజర్స్ క్రికెటర్లు షాపింగ్
- షాపింగ్ చేసిన వారిలో జయదేవ్ ఉనద్కత్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, టీ. నటరాజన్, అబ్దుల్ సమద్
- తమ అభిమాన క్రికెటర్లతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్
ఈ క్రమంలో తాజగా గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో సన్ రైజర్స్ క్రికెటర్లు సందడి చేశారు. జయదేవ్ ఉనద్కత్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, టీ. నటరాజన్, అబ్దుల్ సమద్‌లు మాల్‌లో షాపింగ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ అభిమాన ఆటగాళ్లతో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.