నేడు తెలంగాణ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు తెలంగాణ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

PM Modi Tour in Telangana on 30th April
  • జ‌హీరాబాద్, మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తుగా ప్ర‌ధాని ఎన్నిక‌ల‌ ప్ర‌చారం
  • మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో జహీరాబాద్‌కు మోదీ
  • సాయంత్రం 4:30 గంటల నుంచి 5:20 వరకు ప్ర‌జాస‌భ‌లో ప్రసంగం
  • ఈ సభ ముగిసిన త‌ర్వాత‌ 5:30 గంటలకు జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్‌పోర్టుకు
  • అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుప‌య‌నం
పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా మంగ‌ళ‌వారం ప్రధాని న‌రేంద్ర మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రాష్ట్రానికి వ‌స్తున్నారు. జ‌హీరాబాద్ ఎంపీ అభ్య‌ర్థి బీబీ పాటిల్, మెద‌క్ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావుకు మ‌ద్ధ‌తుగా ప్ర‌ధాని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొననున్నారు.

తెలంగాణ‌లో ఇవాళ్టి మోదీ పూర్తి షెడ్యూల్ ఇలా..
ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో జహీరాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 5:20 వరకు ప్ర‌జాస‌భ‌లో ప్రసంగిస్తారు. ఈ సభ ముగిసిన త‌ర్వాత‌ 5:30 గంటలకు జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

కాగా, మే 3, 4వ తేదీల్లో ప్ర‌ధాని తెలంగాణ‌లో పర్య‌టిస్తార‌ని మొద‌ట బీజేపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఈ తారీఖుల్లో మోదీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. మే 8, 9 తేదీల్లో ప్ర‌ధాని రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. మే 8న వేముల‌వాడ‌లో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రవుతార‌ని స‌మాచారం.  

ఇదిలాఉంటే మే 1న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు నిర్వ‌హించే రోడ్ షోలో ఆయ‌న పాల్గొన‌నున్నారు. లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి శాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో కొన‌సాగ‌నుంది. వచ్చే నెల 5న సైతం నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి అభ్యర్థులకు మద్దతుగా అమిత్ షా ఆయా నియోజకవర్గాల‌లో పర్యటిస్తార‌ని స‌మాచారం.
Advertisement
PM Modi
Telangana
Lok Sabha Polls
BJP

More Telugu News