బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్.. వీడియో ఇదిగో!
- కేసీఆర్ బస్సు యాత్రలో ఉండగా ఘటన
- ఇటీవలే పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి
- ఇప్పుడు సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేరిన అమిత్
- దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో చేరిక
ఇటీవల గుత్తా సుఖేందర్ కూడా పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. అధినేత కేసీఆర్, నాయకుల తీరును తూర్పారబట్టారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఆరు నెలలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, తనకే అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మిగతా వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఓటమిపై ఇప్పటి వరకు సమీక్ష చేయలేదని మండిపడ్డారు. దీంతో ఆయన కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన దానిని కొట్టిపడేశారు. ఇప్పుడాయన కుమారుడు సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేరడం బీఆర్ఎస్‌లో కలవరం రేపింది.