Jagga Reddy: కిషన్ రెడ్డికి హిందూ సంప్రదాయం గురించి ఏమీ తెలియదు: జగ్గారెడ్డి

Jagga Reddy says Kishan Reddy didnt know about hindu
షార్ట్స్‌లో చూడండి
కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి హిందూ సంప్రదాయం గురించి ఏమీ తెలియదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్క్రిప్ట్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఎల్‌కే అద్వానీ పెట్టిన భిక్షతో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం భారత దేశ ప్రజల కుటుంబమన్నారు.

గ్రామీణాభివృద్ధి కోసం సోనియా గాంధీ నాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకు వచ్చారని, ఇప్పుడు అది గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అక్షయపాత్ర వంటిదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక అడ్డమైన షరతులతో ఈ పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మోదీ పేదలకు శాపంగా మారారన్నారు. తెలుగువాడైన పీవీ నరసింహారావును ప్రధానిగా చేసిన ఘనత సోనియా గాంధీదే అన్నారు.

ఇరవై రెండేళ్లు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారన్నారు. పదవిని త్యాగం చేసిన సోనియా గాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ వారికి లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయామనే ఒత్తిడిలో ఉన్నారన్నారు. లోక్ సభ ఎన్నికలలో కేటీఆర్ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ బీజేపీలో ఉండదన్నారు.
Go Back to Shorts
Jagga Reddy
G. Kishan Reddy
BJP
Lok Sabha Polls

More Telugu News