Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ట్వీట్ పై ఘాటుగా స్పందించిన సజ్జల

Sajjala strongly reacts on Chandrababu tweet
షార్ట్స్‌లో చూడండి
ఇవాళ పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తోడబుట్టిన చెల్లెలి పుట్టుకపైనా... మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం... ఇది వికృత మనస్తత్వం కాదా? అని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే... చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృత ఆలోచనలు చూస్తే మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతోంది అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే... చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
Jagan
Chandrababu
YSRCP
TDP

More Telugu News